![Venuthirigedhana Nenu](https://source.boomplaymusic.com/group10/M00/10/07/6461531a8645487793b12e6b887d3141_464_464.jpg)
Venuthirigedhana Nenu Lyrics
- Genre:Gospel
- Year of Release:2022
Lyrics
చేజారినా నా చిన్ని హృదయం
ఓ ముళ్ళ పొదలో చిక్కుకుని
నే చేసినా ఓ చిన్ని దోషం అగ్నిజ్వాలై
అలుముకొనెనే
చేజారినా నా చిన్ని హృదయం
ఓ ముళ్ళ పొదలో చిక్కుకుని
నే చేసినా ఓ చిన్ని దోషం అగ్నిజ్వాలై
అలుముకొనెనే
నా అన్నవారికినేను దూరమై
నా కన్నవారికి నేను భారమై
ఎక్కెక్కి ఏడ్చినా వేళా ఒంటరై
నా ఎదురు చూపులఫలితం శూన్యమై
నేనున్న వేళా
నా నాన్నలా
నన్నాదరించిన యేసయ్యా నీకొందనం
నా జీవితం నీదే
నా సమస్తము నీకే
నా జీవితం నీదే
నా సమస్తము నీకే
వెలివేసినా నా జనుల ఎదుటే
వెలిగించినావే ఓ దివ్వెగా
వెలలేని నన్ను విలువైనవానిగా
మార్చినావే నిను చేరగా
వెలివేసినా నా జనుల ఎదుటే
వెలిగించినావే ఓ దివ్వెగా
వెలలేని నన్ను విలువైనవానిగా
మార్చినావే నిను చేరగా
ఆద్యంతం నీలోనే నను పెంచినావే
అనునిత్యం నీతోనే నను నడిపినావే
ఆశ్చర్య కార్యాలెన్నో చేసినవే
అత్యున్నతమైన ఆత్మతో నింపినా
నను ఎన్నుకున్న ఏర్పరచుకున్న
నా తోడునీడ అండదండ నీవే
నా జీవితం నీదే
నా సమస్తము నీకే
నా జీవితం నీదే
నా సమస్తము నీకే